Renigunta: రేణిగుంట ఎంపీపీగా మునిచంద్రా రెడ్డి, వైస్ ఎంపీపీగా సుప్రియ!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా మునిచంద్రా రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా సుప్రియ గురువారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.
Renigunta: రేణిగుంట ఎంపీపీగా మునిచంద్రా రెడ్డి, వైస్ ఎంపీపీగా సుప్రియ!
రేణిగుంట: రేణిగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఎంపీపీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎంపీటీసీ సభ్యులతో రిటర్నింగ్ అధికారి ఆదినారాయణ నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపట్టగా, ఎంపీపీగా మునిచంద్రా రెడ్డి, వైస్ ఎంపీపీగా సుప్రియ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమం రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ రవిచంద్ర, రిటర్నింగ్ అధికారి ఆదినారాయణ నాయుడు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ మునిచంద్రా రెడ్డి, వైస్ ఎంపీపీ సుప్రియలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.




