Renigunta: రేణిగుంట మండలంలో మధ్యాహ్నం 1 గంటకు 69.20% పోలింగ్ నమోదు!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69.20 శాతం పోలింగ్ నమోదైంది. తండ్లంలో అత్యధికంగా 91.69 శాతం ఓట్లు పోలయ్యాయి.
Renigunta: రేణిగుంట మండలంలో మధ్యాహ్నం 1 గంటకు 69.20% పోలింగ్ నమోదు!
రేణిగుంట: రేణిగుంట మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీల్లో మధ్యాహ్నం 1:00 గంట సమయానికి మొత్తం 69.20 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలోని 182 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 58,798 మంది ఓటర్లు ఉండగా, వారిలో 40,691 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయడం విశేషం.
పోలైన మొత్తం ఓట్లలో పురుషులు 19,416 మంది కాగా, మహిళలు 21,275 మంది ఉన్నారు. పంచాయతీల వారీగా పరిశీలిస్తే తండ్లం పంచాయతీలో అత్యధికంగా 91.69 శాతం పోలింగ్ నమోదు కాగా, మేజర్ పంచాయతీ అయిన రేణిగుంటలో అత్యల్పంగా 56.81 శాతం పోలింగ్ నమోదైంది.
పంచాయతీల వారీగా నమోదైన పోలింగ్ వివరాలు:
తండ్లం, 91.69% (563 ఓట్లు), సురప్పకాశం, 90.32% (1,437 ఓట్లు), విప్పమాని పట్టెడ, 87.31% (695 ఓట్లు), వెంకటాపురం, 83.12% (2,610 ఓట్లు), అతూరు, 82.59% (1,475 ఓట్లు), ఎలమండ్యం, 82.30% (2,706 ఓట్లు), గురవరాజుపల్లె, 82.26% (1,581 ఓట్లు), మామండూరు, 81.85% (821 ఓట్లు), కృష్ణాపురం, 80.14% (1,279 ఓట్లు), ఆర్. మల్లవరం, 79.02% (1,183 ఓట్లు), జీపాలెం, 76.90% (1,578 ఓట్లు), గాజులమండ్యం, 76.69% (3,046 ఓట్లు), తూకివాకం, 69.98% (3,037 ఓట్లు), కరకంబాడి, 65.77% (7,004 ఓట్లు), రేణిగుంట, 56.81% (11,676 ఓట్లు)




