Renigunta: రేణిగుంట మండలంలో 58.92 శాతం పోలింగ్ నమోదు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ 58.92 శాతంతో ముగిసింది. పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Nov 2026 6:18 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో 58.92 శాతం పోలింగ్ నమోదు!

రేణిగుంట: రేణిగుంట మండలంలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 58.92 శాతం ఓటింగ్ నమోదైంది. మండలవ్యాప్తంగా 70 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 62,579 మంది ఓటర్లు ఉండగా, 36,875 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 17,726 మంది పురుషులు, 19,149 మంది మహిళలు ఓటు వేశారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.

పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ వివరాలు:

మొత్తం ఓటర్లు: 62,579

పురుష ఓటర్లు: 29,795

మహిళా ఓటర్లు: 32,553

మొత్తం పోలైన ఓట్లు: 36,875

పురుషుల ఓట్లు: 17,726

మహిళల ఓట్లు: 19,149

పోలింగ్ శాతం: 58.92%

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA