Renigunta: రేణిగుంట మండలంలో గ్రామ సమరానికి రంగం సిద్ధం!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు ఈ నెల 15 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో కె.వి. రవిచంద్ర తెలిపారు. 26న పోలింగ్ జరగనుంది.
Renigunta: రేణిగుంట మండలంలో గ్రామ సమరానికి రంగం సిద్ధం!
రేణిగుంట: రేణిగుంట మండలంలో 19 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నట్లు ఎంపీడీవో కె.వి. రవిచంద్ర తెలిపారు. ఇందుకోసం రేణిగుంట, తూకివాకం, ఎలమండ్యం, ఆర్. మల్లవరం, గాజులమండ్యం, కరకంబాడి గ్రామాల్లో ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 18న నామినేషన్ల పరిశీలన, 19న అప్పీళ్ల స్వీకరణ, 20న అప్పీళ్ల పరిష్కారం, 21న తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
మండల అధికారుల సమన్వయంతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీడీవో రవిచంద్ర స్పష్టం చేశారు.




