Renigunta: రేణిగుంట మండలంలో ఉదయం 9 గంటల వరకు 28.46% పోలింగ్ నమోదు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని 15 పంచాయతీల పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 28.46 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 16,731 మంది ఓటు వేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 Nov 2026 10:54 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట మండలంలో ఉదయం 9 గంటల వరకు 28.46% పోలింగ్ నమోదు!

రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మండలంలోని 15 పంచాయతీల పరిధిలో మొత్తం 182 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 58,798 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు 16,731 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 8,310 మంది పురుషులు, 8,421 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో మొత్తం 28.46 శాతం పోలింగ్ నమోదైంది.

పంచాయతీల వారీగా పోలింగ్ శాతాలు పరిశీలిస్తే..

ఆర్. మల్లవరం – 40.68%, మామండూరు – 40.38%, ఎలమండ్యం – 38.17%, తాండలం – 38.11%, వెంకటాపురం – 36.97%, గురవరాజుపల్లె – 36.47% ,కృష్ణాపురం – 35.78%, జీపాలెం – 33.77%, విప్పమాని పట్టెడ – 29.90%, కరకంబాడి – 29.03%, తూకివాకం – 26.80%, రేణిగుంట – 16.21%

మండలంలోని 15 పంచాయతీల్లో అథూరు అత్యధికంగా 49.72 శాతం పోలింగ్‌తో ముందుండగా, రేణిగుంట పంచాయతీలో అత్యల్పంగా 16.21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA