Renigunta: రేణిగుంటలో కూటమి విజయోత్సవం: అభ్యర్థులకు ఘన సత్కారం!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో పరిషత్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Renigunta: రేణిగుంటలో కూటమి విజయోత్సవం: అభ్యర్థులకు ఘన సత్కారం!
రేణిగుంట: రేణిగుంట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించిన ప్రజలకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా పాదాభివందనాలు తెలిపారు. విజయం సాధించిన బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి జి. పాల్యం తేజోవతి, ఎంపీటీసీ ఐదో సెగ్మెంట్ అభ్యర్థి బి.డి. బాలాజీ, టీడీపీ మూడో సెగ్మెంట్ అభ్యర్థి పవిత్ర రాజ్‌కుమార్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రేణిగుంటలోని జోహో ఎదురుగా ఈశ్వరుడు దేవాలయం వద్ద విజయం సాధించిన ఎంపీటీసీ అభ్యర్థులకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థులపై నమ్మకంతో ఓట్లు వేసి ఘన విజయాన్ని అందించిన రేణిగుంట ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ప్రజలు అందించిన ఈ మద్దతు, ఆదరణతో 2029 ఎన్నికల్లో కూటమికి మరింత ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆశయ సాధనకు అనుగుణంగా స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలే ఈ విజయానికి ప్రధాన కారణమని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రేణిగుంట అభివృద్ధికి కూటమి నాయకులు నిరంతరం కృషి చేస్తారని మహబూబ్ బాషా తెలిపారు.




