Tirupati: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ!
Tirupati: తిరుపతి జిల్లాలో రానున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శుక్రవారం కచ్చపి ఆడిటోరియంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు శిక్షణ తరగతులు ప్రారంభించారు.
Tirupati: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ!
తిరుపతి, నవంబర్ 13: రానున్న పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు) తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు సూచించారు.
శుక్రవారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో తిరుపతి, సూళ్లూరుపేట పరిధిలోని ఆర్వోలు, ఏఆర్వోలకు నిర్వహించిన శిక్షణ తరగతులను జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర ఎన్నికల ప్రక్రియలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించారు.




