Gajulamandyam: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 21 రోజుల జైలు శిక్ష: తిరుపతి కోర్టు

Gajulamandyam: గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి తిరుపతి ప్రత్యేక జేఎస్సీఎం కోర్టు 21 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Oct 2026 5:57 PM IST
Gajulamandyam
X

Gajulamandyam: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 21 రోజుల జైలు శిక్ష: తిరుపతి కోర్టు

తిరుపతి జిల్లా, గాజులమండ్యం: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి తిరుపతి ప్రత్యేక జేఎస్సీఎం కోర్టు 21 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రేణిగుంట మండలం పద్మానగర్‌కు చెందిన బుజ్జిపల్లి రామాంజనేయులు (45) కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.

దీంతో అక్టోబర్ 5 నుంచి 25వ తేదీ వరకు 21 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు IPS ఆదేశాల మేరకు, రేణిగుంట SDPO శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో గాజులమండ్యం ఎస్సై హరీష్, సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని ఎస్పీ తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA