Tirupati: తిరుపతిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
Tirupati: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మరియు ఎస్పీ సుబ్బరాయుడు.
Tirupati: తిరుపతిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
Tirupati: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణలతో కలిసి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ఎల్లవేళలా అనుసరణీయమని తెలిపారు. దేశ పురోగతికి ఆయన అందించిన సేవలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ పునికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొని మహాత్మునికి నివాళులు అర్పించారు.




