Renigunta: ఉప రాష్ట్రపతి తిరుమల పర్యటనకు రేణిగుంట, తిరుచానూరుల్లో పటిష్ట ఏర్పాట్లు!
Renigunta: ఈ నెల 26, 27 తేదీల్లో గౌరవ ఉప రాష్ట్రపతి తిరుమల పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, తిరుమలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పటిష్ట భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.
Renigunta: ఉప రాష్ట్రపతి తిరుమల పర్యటనకు రేణిగుంట, తిరుచానూరుల్లో పటిష్ట ఏర్పాట్లు!
Renigunta: ఈ నెల 26, 27 తేదీల్లో గౌరవ ఉప రాష్ట్రపతి తిరుమల పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, తిరుమలలో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు శనివారం తనిఖీ చేశారు.
ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటన సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.




