Tirupati: తిరుపతి శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శనలు
Tirupati: తిరుపతి శిల్పారామంలో ఆదివారం జరిగిన భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. చెన్నై కళాకారుల బృందం శాస్త్రీయ నృత్యాలతో అలరించింది.
Tirupati: తిరుపతి శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శనలు
తిరుపతి: తిరుపతి శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చెన్నైలోని భరత చూడామణి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కు చెందిన , నాట్య గురుకుల్ బృందం కళాకారులు తమ అద్భుత నృత్య ప్రదర్శనలతో ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. గురువులు ఇందువదన, అనుపమ అరవింద్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన పలు అంశాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.
ఈ కార్యక్రమంలో అనుపమ అరవింద్, అర్చన పాటిల్, శృతి బైసాని, స్వదేశా సాన్వీ జెనా, రిషికా తంవాడ, దియా శ్రీజిత్, సౌపర్ణికా గోపీనాథ్, మేధా శ్రీ శంకర్, అదితి గోకుల్, హర్నిక గోకుల్, మరియు సుభిక్ష పి పాల్గొన్నారు. ప్రదర్శించిన ముఖ్య అంశాలు పుష్పాంజలి తరీత ఝం, గణేశ స్తుతి ప్రభో గణపతే, గణేశ కౌతువం, మూషిక వాహనం, గజాననయుతం కీర్తనలతో కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో ప్రారంభించారు. ప్రత్యేక నృత్యాలు స్వరజాతి, ఖమస్ జతీస్వరం, శబ్దం, మల్లారి, థిల్లానా వంటి శాస్త్రీయ అంశాలకు కళాకారులు కళ్ళకు కట్టినట్లు అభినయించారు.
కీర్తనలు శ్రీ చక్ర రాజా, తిరుపరం కుంద్ర వేల, పదాలు, మాధవ మామవ దేవ, దేవి నీయే తునై, పరమానందం, కన్నన్ మధురై గీతం, మీనాక్షి తాయే, ఆడుం దైవం వంటి కీర్తనలకు చేసిన నాట్యం విశేషంగా అలరించింది. శిల్పారామం పరిపాలన అధికారి ఖాదర్ వలీ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకకు సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరై కళాకారులను అభినందించారు.




