Tirupati: తిరుపతిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 2,617 మందితో బందోబస్తు
Tirupati: తిరుపతి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 2,617 మంది పోలీసులతో భారీ బందోబస్తు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉన్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి.
Tirupati: తిరుపతిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 2,617 మందితో బందోబస్తు
తిరుపతి: జిల్లా వ్యాప్తంగా నవంబర్ 5న నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
ఎన్నికల బందోబస్తు విధుల కోసం మొత్తం 2,617 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించినట్లు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ వెల్లడించారు.
ఎన్నికల భద్రతలో భాగంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లను అందుబాటులో ఉంచారు.
ఈ క్రమంలో ఎస్పీ కోడూరు, పుల్లంపేట ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.




