Tiruchanuru: యోగి మల్లవరంలో ఉత్సాహంగా ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారం!

Tiruchanuru: తిరుచానూరు మేజర్ పంచాయతీ యోగి మల్లవరంలో ఎన్డీయే కూటమి శ్రేణుల విస్తృత ఎన్నికల ప్రచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ భారీ ర్యాలీ.

K VENU, TIRUPATHI RURAL
Published on: 3 Nov 2026 12:42 PM IST
Tiruchanuru
X

Tiruchanuru: యోగి మల్లవరంలో ఉత్సాహంగా ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారం!

Tiruchanuru: తిరుచానూరు మేజర్ పంచాయతీ యోగి మల్లవరంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో భాగంగా తిరుపతి రూరల్ (మండలం), తిరుచానూరు గ్రామంలో ఎన్డీయే కూటమి శ్రేణులు విస్తృత స్థాయి ప్రచారంతో హోరెత్తించాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి భాగస్వామ్యంతో శ్రేణులు ఏకతాటిపైకి రావడంతో గ్రామంలో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది.

పసుపు జెండాల రెపరెపలు, నాయకుల నినాదాల నడుమ ప్రచార పర్వం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అనంతరం కూటమి బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థి ముచ్చేలి. ధనలక్ష్మి, ఎంపీటీసీ -5 అభ్యర్థి జే.హెచ్. ఎలిజిబెత్ లను సైకిల్ గుర్తుపై ముద్రించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. కూటమి నాయకులు, కార్యకర్తల భారీ ర్యాలీతో గ్రామంలోని ప్రతి వీధి, వాడవాడలా విస్తృత ప్రచారం చేపట్టారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL