Tiruchanur: పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ. 5.17 లక్షల పాత్రల విరాళం

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అన్నప్రసాద విభాగానికి కాన్పూర్ భక్తులు అనిల్ కుమార్ జైస్వాల్ రూ. 5.17 లక్షల వంట పాత్రలను విరాళంగా అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 24 Nov 2026 7:36 PM IST
Tiruchanur
X

Tiruchanur: పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ. 5.17 లక్షల పాత్రల విరాళం

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు చెందిన భక్తులు అనిల్ కుమార్ జైస్వాల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అన్నప్రసాద విభాగానికి ఉపయోగించే రూ. 5,17,000 విలువైన వంట పాత్రలను ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు.

ఆలయానికి విచ్చేసిన దాతలకు అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంలో వేద పండితులు దాతల కుటుంబానికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు వారికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రమేష్, ప్రసాదాల ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంత్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL