Tiruchanoor: తిరుచానూరు సర్పంచ్ అభ్యర్థిగా మునెమ్మ నామినేషన్ దాఖలు
Tiruchanoor: తిరుచానూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి మద్దతుతో వడ్రాయన మునెమ్మ నామినేషన్ వేశారు; అభివృద్ధి, అవినీతి నిర్మూలన తన లక్ష్యమన్నారు.
Tiruchanoor: తిరుచానూరు సర్పంచ్ అభ్యర్థిగా మునెమ్మ నామినేషన్ దాఖలు
తిరుచానూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వడ్రాయన మునెమ్మ నామినేషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ మద్దతు, కూటమి నాయకుల సహకారంతో తనను సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు కూటమి నాయకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ సందర్భంగా తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తల్లి మునెమ్మ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి, గ్రామ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె ప్రకటనలో తెలిపారు. పదవి కోసం కాదు. ప్రజాస్వామ్య ముఖ్యమని భావించి ఎన్నికల బరిలో దిగడం జరిగింది. తిరుచానూరు పంచాయతీ అభివృద్ధి మా ప్రధాన కర్తవ్యం.
మాటల్లో చెప్పే వాళ్ళము కాము, చేతిల్లో చేసి చూపిస్తాము. అధికారం శాశ్వతం కాదు, ప్రజల అభిమానం, ఆదరణ శాశ్వతం. మాకు ఒక అవకాశం ఇచ్చి ఆదరించండి, దశాబ్ద కాలంగా ఉన్న అవినీతిని అంతం చేసి చూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




