Tirupati: పద్మావతి బ్రహ్మోత్సవాలకు తిరుపతి మేయర్‌కు ఆహ్వానం!
Tirupati: డిసెంబర్ 6 నుంచి జరిగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్ దంపతులను డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ ఆహ్వానించారు.
Tirupati: పద్మావతి బ్రహ్మోత్సవాలకు తిరుపతి మేయర్‌కు ఆహ్వానం!
Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలకు తిరుపతి మేయర్ మన్నెం శ్రీనివాస ప్రసాద్ జేబీ శ్రీనివాస్ దంపతులను ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, అర్చకులు బాబు స్వామి, టీటీడీ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. తిరుపతి మేయర్ ని శాలువాతో సత్కరించిన వేద పండితులు, ఆయనకు వేదాశీర్వచనం చేశారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు మేయర్ దిశా నిర్దేశం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపర్డెంట్ ముని చెంగల్ రాయలు, అర్చకులు బాబు స్వామి, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.




