Renigunta: రేణిగుంటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు కట్టుదిట్టమైన భద్రత!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 19 Oct 2026 12:08 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు కట్టుదిట్టమైన భద్రత!

Renigunta: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ జరగనున్న నేపథ్యంలో, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం రేణిగుంట ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీస్, పంచాయతీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర, రేణిగుంట రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. మంజునాథ రెడ్డి పాల్గొని పంచాయతీ సిబ్బందితో నామినేషన్ల స్వీకరణ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు.

ఎంపీడీవో కార్యాలయ పరిసరాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, పంచాయతీ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై సమీక్షించారు.

నామినేషన్ల స్వీకరణ జరిగే మూడు రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని, శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సూచించారు

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA