Tirupati: తిరుపతిలో క్రేన్ ప్రమాదం సైట్ ఇంజనీర్ సహా ముగ్గురు మృతి!
Tirupati: తిరుపతి డీబీఆర్ రోడ్డులో ఘోర ప్రమాదం. ప్రైవేట్ హోటల్ నిర్మాణ స్థలంలో క్రేన్ గుంతలోకి ఒరిగి సైట్ ఇంజనీర్‌తో సహా ముగ్గురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.
Tirupati: తిరుపతిలో క్రేన్ ప్రమాదం సైట్ ఇంజనీర్ సహా ముగ్గురు మృతి!
Tirupati: తిరుపతి నగరంలోని డీబీఆర్ రోడ్డులో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ హోటల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోతైన గుంతలోకి ఒరిగిపోయింది. ఈ దుర్ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న సైట్ ఇంజనీర్ సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల వివరాలు:
సందీప్ (35): సైట్ ఇంజనీర్ (శ్రీకాకుళం జిల్లా), రామారావు (45): వలస కార్మికుడు (ఒడిశా), గంగయ్య (40): సైట్ వాచ్‌మెన్ (తిరుపతి).
గాయపడిన వారి వివరాలు
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో క్రేన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన షేక్ ఫరహాన్, నౌషాన్లతో పాటు, ఏర్పేడు మండలం ఆర్.మల్లవరం గ్రామానికి చెందిన కూలీ మురుగయ్య ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అనంతరం క్రేన్ కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసి, ప్రమాదానికి గురైన భారీ క్రేన్‌ను తొలగించే సహాయక చర్యలను ముమ్మరం చేశారు.




