Chandragiri: తొండవాడ హైస్కూల్‌లో పేరెంట్స్ కమిటీ ఎన్నిక రసాభాస
Chandragiri: చంద్రగిరి మండలం తొండవాడ హైస్కూల్‌లో పేరెంట్స్ కమిటీ ఎన్నిక వివాదాస్పదమైంది. టీడీపీ, వైసీపీ నేతల వాగ్వాదంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Chandragiri: తొండవాడ హైస్కూల్‌లో పేరెంట్స్ కమిటీ ఎన్నిక రసాభాస
Chandragiri: చంద్రగిరి మండలం తొండవాడ హైస్కూల్‌లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది. కమిటీ ఎన్నికకు రాజకీయ రంగు పులుముకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
స్కూల్ ప్రాంగణం సమీపంలో వైసీపీ, టీడీపీ నాయకులు హడావిడి చేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పేరెంట్స్ కమిటీ ఎన్నికను పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
మరోవైపు ఎన్నిక నిర్వహించాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉపాధ్యాయులు ఉన్నారు. ఎన్నికపై స్పష్టత కోసం ఎంఈఓ అధికారిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందించకపోవడంతో ఉపాధ్యాయులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికను సజావుగా నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ పరిణామాలతో తొండవాడ హైస్కూల్‌లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.




