Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గొల్లపల్లి అమూల్య!
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గొల్లపల్లి అమూల్య!
Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో రాజోలు నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి గొల్లపల్లి అమూల్య శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందకరమైన, భక్తిపూర్వకమైన అనుభూతిని కలిగించిందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీవారి కృపాకటాక్షాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని శ్రీవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి, ప్రజలకు మెరుగైన పాలన, సంక్షేమం అందేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ప్రశాంతత, సౌభాగ్యం వెల్లివిరియాలని శ్రీవెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు గొల్లపల్లి అమూల్య తెలిపారు.




