Tirupati: రేణిగుంటలో పరిశుభ్రతే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం!

Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంటలో ‘స్వచ్ఛ పథం’ కార్యక్రమం. పరిశుభ్రమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై అధికారుల అవగాహన.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 30 Sept 2026 8:55 AM IST
Tirupati
X

Tirupati: రేణిగుంటలో పరిశుభ్రతే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం!

Tirupati: పరిశుభ్రమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా రేణిగుంట పట్టణంలో ‘స్వచ్ఛ పథం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవి చంద్ర,డిప్యూటీ ఎంపీడీఓ ప్రభు రావు,ఈవో శ్రీధర్ తదితర అధికారులు సిబ్బంది పాల్గొని ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారి వద్ద స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణపై అవగాహన కల్పించే ప్రచార ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఇళ్ల నుంచి వెలువడే చెత్తను బాధ్యతగా నిర్వహించాలని, పరిసరాల్లో చెత్తను విచ్చలవిడిగా వేయకుండా పరిశుభ్రతను కాపాడాలని సూచించారు.ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా మారుతాయని అధికారులు పేర్కొన్నారు.

స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. ‘నా పరిసరాలు.. నా బాధ్యత’ అనే భావనతో ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA