Tirupati: తిరుపతిలో ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తులతో దాడి!
Tirupati: తిరుపతిలోని ఎస్వీసీఈ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి తరుణ్‌పై బయటి వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
Tirupati: తిరుపతిలో ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తులతో దాడి!
Tirupati: కరకంబాడి రోడ్డులోని ఎస్‌వీసీఈ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తరుణ్ అనే విద్యార్థిపై కత్తులతో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. కళాశాల ఎదుట బయట వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో తరుణ్ తీవ్రంగా గాయపడటంతో సహ విద్యార్థులు 108 అంబులెన్స్ ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.




