Raja Street: సునీత సేవా సంస్థలో మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ!
Raja Street: రాజా వీధిలోని సునీత సేవా సంస్థలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం స్వయం ఉపాధితోనే ఆర్థిక వికాసమని సారంగం శ్రీనివాసులు వెల్లడి.
Raja Street: రాజా వీధిలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో
సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మార్గదర్శనంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ. శిబిరంలో టైలరింగ్ లో శిక్షణ పూర్తి చేసుకుని రికార్డు వర్క్ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లను సునీత సేవా సంస్థ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు చేతులమీదుగా బహుకరించడం జరిగినది.
సునీత సేవా సంస్థ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు ప్రసంగిస్తూ మహిళలు మనసు పెడితే నేర్చుకోలేని విద్య లేదు మహిళలు ఏ వృత్తి విద్యలో శిక్షణ పొందిన దానిలో పూర్తిగా నైపుణ్యం సాధిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. మహిళలు ఏదో ఒక వృత్తి విద్యలో నైపుణ్యం సాధించి తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలని అన్నారు.
సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి ప్రసంగిస్తూ గత 26 సంవత్సరాలుగా 25 వృత్తి విద్యలలో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నాము. వేలాదిమంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారు. వృత్తి విద్యలతో పాటు మహిళా సాధికారత పొందేలా మహిళలను అన్ని రంగాలలో తీర్చిదిద్దేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము అన్నారు.
శిక్షణ పూర్తి చేసుకుని రికార్డు వర్క్ పూర్తి చేసిన మహిళలకు సునీత సేవా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
సారంగం శ్రీనివాసులు సారంగం సులక్ష్మి మరియు శిక్షకురాలు జ్యోతి. చేతుల మీదుగా సర్టిఫికెట్లను బహుకరించారు.పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.




