Tada: మాంబట్టులో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ విస్తృత పర్యటన!
Tada: తిరుపతి జిల్లా మాంబట్టులో టీడీపీ శ్రేణుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్ష.
Tada: మాంబట్టులో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ విస్తృత పర్యటన!
తడ: అధికార హోదా ఇచ్చే ఆడంబరాలు ఆమె దరిచేరవు.. ఎమ్మెల్యే అనే గర్వం అసలే కనిపించదు.. ప్రతి అవ్వా తాతను 'బాగున్నారా' అంటూ ఆప్యాయంగా పలకరించే తీరు చూస్తే ఏ ప్రజాప్రతినిధికైనా పొంగిపోయే అభినందనలు అందక మానవు. తిరుపతి జిల్లా తడ మండలం, మాంబట్టు గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమీక్షా సమావేశంలో సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని, తనదైన ప్రజాదరణతో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలోని క్షేత్రస్థాయి పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులపై ఎమ్మెల్యే డా. విజయశ్రీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని వివరాలు ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడా అలసత్వం వహించవద్దని అధికారులు, నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
అయితే ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆత్మీయతానురాగాలే. ఒక శాసనసభ్యురాలిగా కాకుండా ఒక సాధారణ మహిళగా ప్రజల్లో కలిసిపోయిన తీరు అందరినీ ముగ్ధులను చేసింది. ఎలాంటి హుందాతనం, హోదా అడ్డంకులు చూపించకుండా స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను ఓపిగ్గా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ పేర్లు పెట్టి పిలుస్తూ, వయోవృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యాన్ని నింపారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి, తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుని తన శైలి వేరని నిరూపించుకున్నారు.
ఈ కార్యక్రమంలో తడ తహశీల్దార్ కన్నంబాకం రవి కుమార్, తడ మండల పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి ఇన్‌చార్జులతో పాటు కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరాడంబరంగా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న డాక్టర్ నెలవల విజయశ్రీ నాయకత్వంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.




