Sullurupeta: చెంగాళమ్మ ఆలయ హుండీ ఆదాయం ₹69.15 లక్షలు!
Sullurupeta: సూళ్ళూరుపేట శ్రీచెంగాళమ్మ ఆలయంలో పరకామణి. 107 రోజులకు గాను హుండీ ద్వారా ₹69.15 లక్షల నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కానుకలు.
Sullurupeta: చెంగాళమ్మ ఆలయ హుండీ ఆదాయం ₹69.15 లక్షలు!
సూళ్ళూరుపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పరకామణి (హుండీ లెక్కింపు) కార్యక్రమాన్ని అధికారుల సమక్షంలో బుధవారం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. గడిచిన 107 రోజులకు గాను దేశ విదేశాల నుండి విచ్చేసిన భక్తులు శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి రూ. 69,15,109 (అరవై తొమ్మిది లక్షల పదిహేను వేల నూట తొమ్మిది రూపాయలు) నగదు ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
భక్తులు నగదు రూపంలోనే కాకుండా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల్లో 18.250 మిల్లీగ్రాముల బంగారం, 193.050 మిల్లీగ్రాముల వెండి ఆభరణాలను లెక్కింపు సమయంలో సేకరించి భద్రపరిచారు. వీటితో పాటు విదేశీ కరెన్సీ రూపంలో USA డాలర్స్-1, కెనడా డాలర్స్-100, అరబ్ దిర్హామ్స్-115, థాయ్ బాత్-250 అమ్మవారి హుండీ ఆదాయంగా సమకూరాయని తెలిపారు.
దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పి. ఫణిరాజ పర్యవేక్షణలో, ఆలయ సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి (ఈవో) బి. ప్రసన్నలక్ష్మి ప్రత్యక్ష సమక్షంలో ఈ హుండీ లెక్కింపు ప్రక్రియను శ్రద్ధతో పూర్తి చేయడం జరిగింది.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ, ఆలయ సిబ్బంది, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, మెప్మా సభ్యులు, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి మహిళా సేవా సమితి సభ్యులు, శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి భక్త బృందం ప్రతినిధులు మరియు విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సేవలను అందించారు.




