Sullurupeta: సూళ్ళూరుపేట బస్టాండ్‌కు ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ’ పురస్కారం

Sullurupeta: తిరుపతిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026 కార్యక్రమంలో సూళ్ళూరుపేట బస్టాండ్‌కు కలెక్టర్ చేతుల మీదుగా స్వచ్ఛ బస్టాండ్ అవార్డు లభించింది.

KKV Sudhakar, Sullurupeta
Published on: 2 Oct 2026 9:03 PM IST
Sullurupeta
X

Sullurupeta: సూళ్ళూరుపేట బస్టాండ్‌కు ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ’ పురస్కారం

సూళ్ళూరుపేట: ​తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2026 కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఆర్టీసీ బస్టాండ్‌కు ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ బస్టాండ్ అవార్డు లభించింది. బస్టాండ్ ప్రాంగణంలో పరిశుభ్రత, మెరుగైన నిర్వహణ, ప్రయాణికులకు అందించే సౌకర్యాలలో ఉత్తమ పనితీరుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.

తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆర్టీసీ తిరుపతి జిల్లా డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్, సూళ్ళూరుపేట డిపో మేనేజర్ కళ ఈ అవార్డును అత్యంత సంతోషంతో స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందిని కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

​ఈ సందర్భంగా సూళ్ళూరుపేట డిపో మేనేజర్ కళ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రసిద్ధి చెందిన రాకెట్ సిటీ సూళ్ళూరుపేట పట్టణం అన్ని రంగాల్లో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆ అభివృద్ధికి అనుగుణంగానే ఆర్టీసీ బస్టాండ్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కడం వెనుక డిపో అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల నిరంతర శ్రమ దాగి ఉందన్నారు. ఇది అందరి సమిష్టి కృషి ఫలితమేనని కొనియాడారు. బస్టాండ్ ఆవరణను సుందరంగా ఉంచడంలో ప్రయాణికులు చూపిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైన నిబద్ధతతో పనిచేసి సూళ్ళూరుపేట ఆర్టీసీ డిపోను రాష్ట్రంలోనే అత్యుత్తమ మోడల్ డిపోగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని డీఎం కళ స్పష్టం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta