Tirupati: సమస్యలను ధైర్యంగా ఎదుర్కోండి: అదనపు ఎస్పీ శ్రీలత!

Tirupati: సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని లక్ష్య సాధన వైపు అడుగులు వేయాలని తిరుపతి శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల సదస్సులో అదనపు ఎస్పీ ఎం. శ్రీలత పిలుపునిచ్చారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 8 Oct 2026 1:15 PM IST
Tirupati
X

Tirupati: సమస్యలను ధైర్యంగా ఎదుర్కోండి: అదనపు ఎస్పీ శ్రీలత!

Tirupati: విద్యార్థులు సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని, లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని పోలీసులు సూచించారు. క్రమశిక్షణ, నైతిక విలువలను పాటిస్తే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని తెలిపారు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు యువత భద్రత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించేందుకు శక్తి బృందం ఆధ్వర్యంలో కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. శ్రీలత, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఎం.తమీమ్ అహ్మద్ పాల్గొని ఈవ్ టీజింగ్,ర్యాగింగ్, సైబర్ నేరాలు, ప్రేమ వ్యవహారాలు, ఒత్తిడి, ఆత్మహత్యల నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయా అంశాలకు సంబంధించిన ఘటనలను ఉదాహరణలుగా వివరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వ్యక్తిగత లేదా విద్యా సమస్యలు ఎదురైనప్పుడు నిరాశకు లోనై తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణతో జీవించాలని, విద్యకు ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.

అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ವಿದ್ಯಾರ್ಥుల భద్రత, భవిష్యత్తు కోసం ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA