Renigunta: విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి: విద్యార్థి సంఘాలు
Renigunta: రేణిగుంట నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి పవన్ కళ్యాణ్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
Renigunta: విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి: విద్యార్థి సంఘాలు
రేణిగుంట: రేణిగుంటలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న పవన్ కళ్యాణ్ (16) అనే విద్యార్థి ఆత్మహత్య ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట నిరసన చేపట్టారు.
విద్యార్థిపై చదువు, ర్యాంకుల విషయంలో ఒత్తిడి ఉందని వచ్చిన ఆరోపణలపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విషయంలో విద్యార్థి కుటుంబ సభ్యులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించి, ఘటనకు దారితీసిన పరిస్థితులను సమగ్రంగా విచారించాలని కోరారు. విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చిన మేరకు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఎస్‌వీ యూనివర్సిటీ అధ్యక్షుడు మన్నం ప్రేమ్ కుమార్, ఎన్‌ఎస్‌యూఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి హెచ్. లోకేష్, ఎన్‌డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కోలార్ పరమేష్, విద్యార్థి నాయకులు గౌతమ్, తేజస్వంత్ తదితరులు పాల్గొన్నారు.




