Tirupati: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి టికెట్ల రచ్చ - పునరుద్ధరణతో ఊరట!
Tirupati: రేణిగుంట విమానాశ్రయంలో ముందస్తు సమాచారం లేకుండా శ్రీవాణి టికెట్ల జారీ నిలిపివేయడంతో భక్తుల ఆందోళన. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ చొరవతో మళ్లీ ప్రారంభం.
Tirupati: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి టికెట్ల రచ్చ - పునరుద్ధరణతో ఊరట!
Tirupati: తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ల జారీని నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా టికెట్లు బంద్ చేయడమేంటని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సమస్య తీవ్రతను గుర్తించిన ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కె.ఎమ్. భూమినాథ్ తక్షణమే స్పందించారు. టీటీడీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఆయన చొరవతో అధికారులు వెంటనే స్పందించి శ్రీవాణి టికెట్ల జారీని పునఃప్రారంభించారు. దీంతో వివాదం సర్దుమణగడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.




