Srikalahasti: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేస్తాం మధుసూదన్ రెడ్డి

Srikalahasti: శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌సీపీ మండల విస్తృత స్థాయి సమావేశం. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ధీమా.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 5 Oct 2026 7:13 PM IST
Srikalahasti
X

Srikalahasti: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేస్తాం మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన శ్రీకాళహస్తి మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాలు, వార్డుల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజాదరణ, అంకితభావం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి వారి విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.

కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెదిరింపులు వచ్చినా పార్టీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

జగనన్న హయాంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయి బలాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే లక్ష్యమని, రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయంతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు బర్రి సుదర్శన రెడ్డి, మండల అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, చెలికం నాగరాజు రెడ్డి, రంగినేని చెంచయ్య నాయుడు, యుగంధర్ రెడ్డి కందాటి, సురేంద్ర యాదవ్, గంగిరెడ్డి, భానుమూర్తి యాదవ్, వయ్యాల మనోహర్ రెడ్డి, నలుగురి రవి, కేఎస్ సుబ్రమణ్యం, మునిరత్నం రెడ్డి, కృష్ణయ్య, రవీంద్ర రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మధుమోహన్ రెడ్డి, మునిరాజా, గురునాథం రెడ్డి, రామచంద్రయ్య, అంకయ్య, భాను రెడ్డి, ప్రభోస్, మోడీ రాజా, సురేష్, రామచంద్రా రెడ్డి, శివారెడ్డి, గుణ, శివ, జయకృష్ణ రెడ్డి, ఎల్లయ్య, రాజారెడ్డి, తిరుపాల్ యాదవ్, మనోహర్ యాదవ్, దిలీప్ బంగారు, రంగయ్య, పోలిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చుక్కల మహేష్, నాగభూషణం, డీవీ రమణ, మద్దిల ప్రకాష్, కోటి రాయల్, కిరణ్ రాయల్, శంకర్ యాదవ్, శివ ఈశ్వరయ్య, వెంకటరెడ్డి, కలివేళయ, ప్రసాద్ యాదవ్, అమర్‌నాథ్ రెడ్డి, పండయ్య యాదవ్, జయకృష్ణ, నక్క పెంచులయ్య, ప్రసాద్, శివ రాయల్, భాను ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI