Srikalahasti: శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు: కలెక్టర్ పరిశీలన

Srikalahasti: శ్రీకాళహస్తి స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 7 Nov 2026 2:46 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు: కలెక్టర్ పరిశీలన

Srikalahasti: ఈ నెల 5వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం స్థానిక స్కిట్ (SKIT) ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అత్యంత ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది.

ఈ కౌంటింగ్ ప్రక్రియను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు సరళిని, భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు విలేకరులతో మాట్లాడుతూ...

తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 కౌంటింగ్ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పటిష్ట భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతోందని వెల్లడించారు.

జిల్లాలోని మొత్తం 312 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇప్పటికే 255 స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయిందని, విజేతలకు డిక్లరేషన్ ఫారాలు కూడా అందజేసినట్లు కలెక్టర్ తెలియజేశారు.

రేణిగుంట, తొట్టంబేడు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ స్థానాల లెక్కింపు పూర్తయ్యిందని చెప్పారు.

ప్రస్తుతం రేణిగుంట, తొట్టంబేడు జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, సాయంత్రం 6:00 గంటలకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

తొట్టంబేడు మండలంలోని తాటిపర్తి ఎంపీటీసీ సెగ్మెంట్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 3 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రీ-కౌంటింగ్ కోరుతున్న విషయాన్ని పాత్రికేయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా... ఈ అంశాన్ని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) పూర్తిస్థాయిలో పరిశీలించి (Examined) తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమర్థవంతంగా లెక్కింపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలియజేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI