Srikalahasti: శ్రీకాళహస్తిలో ‘రణబాలి’ సినిమా సంబరాలు విజయ్ ఫ్యాన్స్ హంగామా!

Srikalahasti: శ్రీకాళహస్తిలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా విడుదల సంబరాలు వైభవంగా జరిగాయి. పాలాభిషేకం, కేక్ కట్‌ చేసి అభిమానులు హంగామా చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 16 Oct 2026 6:48 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో ‘రణబాలి’ సినిమా సంబరాలు విజయ్ ఫ్యాన్స్ హంగామా!

శ్రీకాళహస్తి: విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ చిత్రం విడుదల సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అభిమానులు సందడి చేశారు.

సినిమా విడుదలను పురస్కరించుకుని భారీ సంఖ్యలో అభిమానులు ఒకచోట చేరి తమ అభిమాన నటుడు విజయ్ దేవరకొండకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ‘రణబాలి’ చిత్రం ఘన విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షించారు. ప్రేక్షకులందరూ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నితీష్‌తో పాటు సుబ్బు, ప్రకాష్, జగదీష్ తదితర అభిమానులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI