Srikalahasti: వ్యవసాయ మోటార్లు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్!

Srikalahasti: శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని పొలాల వద్ద వ్యవసాయ మోటార్లను దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను తొట్టంబేడు పోలీసులు అరెస్ట్ చేసి రూ.4.40 లక్షల విలువైన 22 మోటార్లు స్వాధీనం చేసుకున్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 12 Nov 2026 8:53 PM IST
Srikalahasti
X

Srikalahasti: వ్యవసాయ మోటార్లు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్!

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని పొలాల వద్ద వ్యవసాయ మోటార్లను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు ₹4,40,000 విలువైన 22 మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ పావని వెల్లడించారు. తొట్టంబేడు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.

ఇటీవల డివిజన్‌లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పొలాల వద్ద ఉన్న మోటార్లు చోరీకి గురవుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందాయని, దీనిపై కేసులు నమోదు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. పోలీసుల నిఘాలో భాగంగా జయంపు ఈశ్వర్, దేవరకొండ అజిత్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వీరితో పాటు ఈ చోరీలతో సంబంధం ఉన్న మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదయ్యాయని, ప వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితులిద్దరూ రాత్రి సమయాల్లో పొలాల వద్ద ఎవరూ లేని సమయం చూసి మోటార్లను అపహరిస్తున్నట్లు విచారణలో అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామన్నారు.

స్వాధీనం చేసుకున్న 22 మోటార్లను త్వరలోనే సంబంధిత రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె హామీ ఇచ్చారు. ఈ కేసును ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో తొట్టంబేడు ఎస్సై బాలకృష్ణ మరియు ఆయన బృందం ఎంతో కృషి చేశారని డీఎస్పీ పావని అభినందించారు. ప్రతిభ కనబరిచిన ఈ పోలీసు బృందానికి రానున్న గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేసేలా కార్యాచరణ చేపడుతున్నట్లు ఆమె ప్రకటించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI