Srikalahasti: శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్!

Srikalahasti: శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ దర్శించుకుని రాహు-కేతు నివారణ పూజలు నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 10 Nov 2026 6:50 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్!

శ్రీకాళహస్తి: భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సహాయ కేంద్ర మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాహు–కేతు సర్పదోష నివారణ పూజలో పాల్గొన్నారు. స్వామివారి, అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం స్వీకరించారు.

ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ బి.కె. వెంకటేశులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం కేంద్ర మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆశీస్సులు, శేషవస్త్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI