Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయానికి బ్యాటరీ వాహనం విరాళం
Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ భక్తుల సౌకర్యార్థం బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ప్రయాణికుల బ్యాటరీ వాహనాన్ని దేవస్థానం ఈఓకు విరాళంగా అందజేశారు.
Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయానికి బ్యాటరీ వాహనం విరాళం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో ప్రయాణికుల బ్యాటరీ వాహనాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ ఎం.వి.ఎస్. సుధాకర్, రీజినల్ మేనేజర్ కె.వి.కె. కిషోర్ బాబు, శ్రీకాళహస్తి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కార్యం మునిశేఖర్, డీఆర్ఎం చీఫ్ మేనేజర్ ఏ.ఈ.కె. కిషోర్ బాబు తదితర బ్యాంకు అధికారులు, సిబ్బంది కలిసి బ్యాటరీ వాహనాన్ని దేవస్థానం ఈఓ బి.కె. వెంకటేశులు గారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఈఓ బి.కె. వెంకటేశులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో ఈ బ్యాటరీ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు, సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.




