Srikalahasti: శ్రీకాళహస్తిలో ఎన్నికల నియమావళిపై సమీక్ష సమావేశం

Srikalahasti: శ్రీకాళహస్తి పురపాలక ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిపై కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి, డీఎస్పీ పావని సమీక్ష; 26న ఎన్నికల నిర్వహణ.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 20 Nov 2026 6:55 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో ఎన్నికల నియమావళిపై సమీక్ష సమావేశం

శ్రీకాళహస్తి: పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి, డీఎస్పీ పావని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన పలు అంశాలపై రాజకీయ పార్టీల నాయకులు అధికారులను ప్రశ్నించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

అనంతరం కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి, డీఎస్పీ పావని మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని వార్డు కౌన్సిలర్ స్థానాలతో పాటు చైర్‌పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రజలు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI