Srikalahasti: పంచాయతీ ఎన్నికలు: శ్రీకాళహస్తిలో పోలీసుల ముందస్తు తనిఖీలు

Srikalahasti: రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బీఎన్ కండ్రిగ సర్కిల్ పోలీసులు పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 5 Oct 2026 7:43 PM IST
Srikalahasti
X

Srikalahasti: పంచాయతీ ఎన్నికలు: శ్రీకాళహస్తిలో పోలీసుల ముందస్తు తనిఖీలు

శ్రీకాళహస్తి: రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం బీఎన్ కండ్రిగ సర్కిల్ పరిధిలోని చిట్టత్తూరు, బోనుపల్లి, కంచనపల్లి, కారాకొల్లు, తంగెళ్లపాలెం గ్రామాల్లో పోలీసు అధికారులు పర్యటించారు.

బీఎన్ కండ్రిగ సర్కిల్ సీఐ లక్ష్మీనారాయణ, తొట్టంబేడు ఎస్సై బాలకృష్ణ సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా పోలింగ్ జరగనున్న పాఠశాలలు, పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర లోటుపాట్లను పరిశీలించారు.

అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన పోలీసు అధికారులు గతంలో జరిగిన ఎన్నికల సమయంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలు, ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై వివరాలు సేకరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు.

రాబోయే పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI