Srikalahasti: శ్రీకాళహస్తిలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం

Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది; చివరి రోజు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విస్తృత ప్రచారం.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 24 Nov 2026 6:54 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పట్టణంలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి పేట బాలాజీ రెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

మరోవైపు బీజేపీ నేత కోలా ఆనంద్ పట్టణంలోని మాడ వీధుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కోరారు. ఇక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

చివరి రోజు ప్రచారంలో ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది. అనంతరం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రచార కార్యక్రమాలను ముగిస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించారు.

దీంతో శ్రీకాళహస్తిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI