Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా షేక్ సలీం బాషా జన్మదిన వేడుకలు
Srikalahasti: శ్రీకాళహస్తిలో మైనారిటీ నాయకుడు షేక్ సలీం బాషా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి; తమ్ముడు షబ్బీర్ ఆధ్వర్యంలో 200 మందికి అన్నదానం నిర్వహించారు.
Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా షేక్ సలీం బాషా జన్మదిన వేడుకలు
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకుడు షేక్ సలీం బాషా జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా షేక్ సలీం బాషా అభిమాని, తమ్ముడు షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సలీం బాషా అభిమానులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అబ్బు, మోహన్, మస్తాన్, జాఫర్, ఆశీం, చాన్ భాషా, సుధ, మస్తాన్, వాజిద్, శుభహాన్, వసీం, మహమ్మద్, బాలాజీతో పాటు పలువురు యువత పాల్గొన్నారు.




