Srikalahasti: వడ్డీ వ్యాపారుల వేధింపుల కథనాలపై డీఎస్పీ పావని వివరణ!

Srikalahasti: శ్రీకాళహస్తిలో వడ్డీ వ్యాపారుల వేధింపులంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై డీఎస్పీ పావని శనివారం తొట్టంబేడు పోలీస్ స్టేషన్‌లో వివరణ ఇచ్చారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 14 Nov 2026 6:16 PM IST
Srikalahasti
X

Srikalahasti: వడ్డీ వ్యాపారుల వేధింపుల కథనాలపై డీఎస్పీ పావని వివరణ!

తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలపై శ్రీకాళహస్తి డీఎస్పీ పావని స్పందించారు. శనివారం తొట్టంబేడు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

బాధిత మహిళ మేఘమాల నిన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని డీఎస్పీ తెలిపారు. అయితే ఆమె తన ఫిర్యాదులో వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఒత్తిడి చేస్తున్నారని మాత్రమే పేర్కొన్నారని, ఎక్కడా తనను బలవంతంగా తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.

ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో, స్టేషన్ రిసీప్ట్ అందజేసినట్లు తెలిపారు. సోమవారం కోర్టు అనుమతి లభిస్తే కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

అయితే కొన్ని సోషల్ మీడియా ఛానళ్లలో వడ్డీ వ్యాపారస్తులు మేఘమాలపై దాడి చేశారంటూ కథనాలు ప్రసారం కావడంతో, ఆ కథనాలపై స్పందించిన పోలీసులు బాధిత మహిళను మరోసారి సంప్రదించినట్లు తెలిపారు.

తనపై దాడి జరిగినట్లు బాధిత మహిళ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ అంశంపై కూడా ప్రత్యేకంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పావని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో వాస్తవాలను పరిశీలించి, బాధితురాలి ఫిర్యాదు మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పావని వెల్లడించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI