Srikalahasti: తడ మండలం గ్రద్దగుంటలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం!
Srikalahasti: సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం గ్రద్దగుంటలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి గండవరం రమేష్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ సీనియర్ నేతల విస్తృత ప్రచారం.
Srikalahasti: తడ మండలం గ్రద్దగుంటలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం!
Srikalahasti: శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం గ్రద్దగుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గండవరం రమేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఎంపీటీసీ అభ్యర్థి గండవరం రమేష్ రెడ్డికి మద్దతుగా ప్రజలను కలిశారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా, శ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, జిల్లా, మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




