Srikalahasti: అంతర్జాతీయ కరాటే పోటీల్లో శ్రీకాళహస్తి యువకుడికి గోల్డ్ మెడల్!

Srikalahasti: బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో శ్రీకాళహస్తి యువకుడు బొద్దులూరు జ్యోతిశ్వర్ అండర్-16 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటాడు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 1 Nov 2026 5:13 PM IST
Srikalahasti
X

Srikalahasti: అంతర్జాతీయ కరాటే పోటీల్లో శ్రీకాళహస్తి యువకుడికి గోల్డ్ మెడల్!

Srikalahasti: అంతర్జాతీయ వేదికపై శ్రీకాళహస్తి కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ బొద్దులూరు జ్యోతిశ్వర్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బెంగళూరులో నిర్వహించిన అండర్-16 కరాటే పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటాడు.

బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన వరల్డ్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీపడ్డారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో బెంగళూరులోని స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న శ్రీకాళహస్తికి చెందిన బొద్దులూరు జ్యోతిశ్వర్ తన చురుకుదనం, పోరాట పటిమ, అద్భుతమైన క్రీడా నైపుణ్యంతో ప్రత్యర్థులను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ పోటీల్లో జ్యోతిశ్వర్ ప్రథమ స్థానంతో గోల్డ్ మెడల్ సాధించగా, రెండో స్థానంలో కజకిస్తాన్, మూడో స్థానంలో రష్యా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పలు దేశాల క్రీడాకారులతో తలపడి విజేతగా నిలవడం విశేషం.

జ్యోతిశ్వర్ సాధించిన ఈ ఘన విజయంపై మాస్టర్ సంపత్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా స్వామినారాయణ గురుకుల్ విద్యాసంస్థ అధ్యాపకులు సైతం అతని ప్రతిభను కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI