Srikalahasti: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమం

Srikalahasti: శ్రీకాళహస్తిలో ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని ‘ఆశీర్వాద దీపం’ వెలిగించిన కూటమి నాయకులు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్ష.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 17 Sept 2026 6:34 AM IST
Srikalahasti
X

Srikalahasti: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమం

శ్రీకాళహస్తి: భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో “ఆశీర్వాద దీపం” కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాద దీపాన్ని వెలిగించారు.

ప్రధానమంత్రి మోదీ 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు సేవలందించారని నాయకులు పేర్కొన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని, దేశ సేవను మరింత కొనసాగించాలని ఆకాంక్షించారు.

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రజా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI