Srikalahasthi: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి
Srikalahasthi: శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Srikalahasthi: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి
శ్రీకాళహస్తి: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని తేరు వీధిలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయ కమిషనర్ టి. రమేష్ బాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధన కోసం మహాత్మాగాంధీ సత్యాగ్రహం, అహింసా మార్గాలను ఎంచుకోవడం చారిత్రాత్మకమైందన్నారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు గాంధీజీ ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్కౌట్ మాస్టర్ ఎస్.కె. అజారుద్దీన్, పద్మావతి, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.




