Sathyavedu: సత్యవేడులో శ్రీ గురుదేవులు మహాసమాధి

Sathyavedu: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం గురుదేవులు మహాసమాధి చెందారు. రేపటి నుండి మూడు రోజులపాటు ఏకం క్షేత్రంలో భక్తుల దర్శనార్థం ఉంచనున్నారు.

K. SURESH BABU, SATYAVEDU
Published on: 29 Sept 2026 10:29 PM IST
Sathyavedu
X

Sathyavedu: సత్యవేడులో శ్రీ గురుదేవులు మహాసమాధి

సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం ఆధ్యాత్మిక మార్గదర్శకులు, భక్తుల ఆరాధ్య శ్రీ గురుదేవులు మహాసమాధి పొందారు. ఆయన మహాసమాధి వార్తతో భక్తులు, శిష్యులు తీవ్ర విషాదానికి లోనయ్యారు.

ఆధ్యాత్మిక సాధన, మానవతా విలువలు, సేవా భావం, ఆత్మజ్ఞాన సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన శ్రీ గురుదేవుల బోధనలు భక్తుల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయి. ఆయన భౌతిక దేహాన్ని విడిచినా, అందించిన ఆధ్యాత్మిక సందేశాలు, బోధనలు భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని భక్తులు పేర్కొంటున్నారు.

భక్తుల దర్శనార్థం శ్రీ గురుదేవుల భౌతిక దేహాన్ని రేపు వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం ప్రాంతంలోని ఏకం క్షేత్రంలో ఉంచనున్నట్లు సమాచారం. దీంతో గురుదేవుల చివరి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్లు తెలుస్తోంది.

“శ్రీ గురుదేవుల భౌతిక సన్నిధి ఇక మన మధ్య లేకపోయినా… ఆయన దివ్య సందేశం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఎప్పటికీ కొనసాగుతాయి” అని భక్తులు భావోద్వేగంతో స్మరించుకుంటున్నారు. గురుదేవులు తమ దివ్య ప్రయాణాన్ని కొనసాగించిన సందర్భంగా భక్తులు, శిష్యులు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటున్నారు.

“దేహం దూరమైనా… దివ్య సందేశం చిరస్థాయే!” “గురుదేవుల భౌతిక సన్నిధి రేపు ఏకం క్షేత్రంలో… దర్శనానికి తరలిరానున్న భక్తులు!” రేపటి నుండి మూడు రోజులపాటు భక్తుల దర్శనార్థం ఉంచి ఆ తరువాత మహా సమాధి చేయబడతారని సమాచారం ....

K. SURESH BABU, SATYAVEDU

K. SURESH BABU, SATYAVEDU