Renigunta: రేణిగుంటలో తరచూ మొరాయిస్తున్న ఎస్బీఐ ఏటీఎం సేవలు!
Renigunta: రేణిగుంట పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం తరచూ మొరాయిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజల విజ్ఞప్తి.
Renigunta: రేణిగుంటలో తరచూ మొరాయిస్తున్న ఎస్బీఐ ఏటీఎం సేవలు!
Renigunta: రేణిగుంట పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉన్న ఏటీఎం తరచూ మొరాయిస్తుండటంతో ఖాతాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు ఏటీఎం పనిచేస్తే మరోరోజు పూర్తిగా పనిచేయకపోవడం,నగదు ఉపసంహరణకు ప్రయత్నించినప్పుడు తరచూ “ఎర్రర్” సందేశం రావడం, జరుగుతోందని వినియోగదారులు చెబుతున్నారు.
అత్యవసర సమయంలో నగదు అవసరమైనప్పుడు ఏటీఎం పనిచేయకపోవడంతో ఇతర ఏటీఎంలను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, అత్యవసరంగా నగదు అవసరమైన ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
దేశంలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కు చెందిన బ్యాంక్ పక్కనే ఉన్న ఏటీఎం సేవలు ఇలా తరచూ అంతరాయం కలిగించడం బాధాకరమని ప్రజలు అంటున్నారు. ఏటీఎంలో సాంకేతిక సమస్య ఏదైనా ఉంటే వెంటనే గుర్తించి శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.
ప్రజలకు 24 గంటల ఏటీఎం సేవలు అందుబాటులో ఉండేలా సంబంధిత ఎస్బీఐ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యను పరిష్కరించాలని రేణిగుంట ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




