Tirupati: డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం: శాప్ చైర్మన్!
Tirupati: డీఎస్సీ, స్పోర్ట్స్ కోటాపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్ర ఆగ్రహం, కార్యాలయంపై దాడి చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదు.
Tirupati: డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం: శాప్ చైర్మన్!
తిరుపతి: డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటాపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ అభ్యర్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆరోపించారు.
వైసీపీ నేతలు శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉపాధ్యాయులను అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలతో దాడి చేశారని, కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై గతంలో దాడికి పాల్పడిన వారే శాప్ కార్యాలయ ఘటనలోనూ ఉన్నారని వ్యాఖ్యానించారు.
డీఎస్సీ అంటే తెలియని వారు కూడా శాప్ కార్యాలయం వద్దకు వచ్చి విమర్శలు చేస్తున్నారని రవినాయుడు అన్నారు. స్పోర్ట్స్ కోటాపై విమర్శలు చేయడం సరికాదని, నిబంధనల ప్రకారమే క్రీడా కోటా అమలు జరుగుతోందని తెలిపారు.
డీఎస్సీపై ఆధారాలతో మాట్లాడేందుకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ చేసిన ఆయన, కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుందని, అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులపై దాడికి సంబంధించి ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రవినాయుడు స్పష్టం చేశారు.




