Renigunta: రేణిగుంటలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుజాత ప్రచారం
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిని గంగారి సుజాత గ్రామాల్లో పర్యటిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం చేశారు.
Renigunta: రేణిగుంటలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుజాత ప్రచారం
రేణిగుంట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గాజుల మండ్యం మాజీ సర్పంచ్ గంగారి సతీమణి గంగారి సుజాత విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రేణిగుంట మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.




