Renigunta: రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల పంపిణీపై ఓటర్ల తీవ్ర అసంతృప్తి
Renigunta: రేణిగుంట మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేళ బీఎల్ఓల నుంచి ఓటర్ స్లిప్పులు అందక ఓటర్ల తీవ్ర ఆవేదన. పర్యవేక్షణ కరువైందని అధికారులపై ఆగ్రహం.
Renigunta: రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల పంపిణీపై ఓటర్ల తీవ్ర అసంతృప్తి
రేణిగుంట: రేణిగుంట మండలంలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ స్లిప్పుల పంపిణీపై నిర్లక్ష్యం చోటుచేసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న తమకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఓటర్ స్లిప్పులు అందించలేదని పలువురు ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఓటర్ స్లిప్పుల కోసం సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన రావడం లేదని కొందరు ఓటర్లు ఆరోపిస్తున్నారు. దీంతో తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని పలు ప్రాంతాల్లో స్లిప్పుల పంపిణీ పూర్తిస్థాయిలో జరిగిందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న అధికారులు ఓటర్ స్లిప్పుల పంపిణీపై ఎందుకు పర్యవేక్షణ చేయడం లేదని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.




