Renigunta: అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం వన్నె కుల క్షత్రియ సంఘం!

Renigunta: రేణిగుంట జడ్పీటీసీ బీజేపీ అభ్యర్థి జి. పాల్యం తేజోవతికి రాష్ట్ర వన్యకుల క్షత్రియ సంఘం సంపూర్ణ మద్దతు. ఘనంగా సంఘీభావం తెలిపిన నాయకులు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 Nov 2026 9:34 AM IST
Renigunta
X

Renigunta: అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం: వన్నె కుల క్షత్రియ సంఘం!

రేణిగుంట: రేణిగుంట జడ్పీటీసీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర వన్యకుల క్షత్రియ సంఘం డైరెక్టర్ జి పాల్యం తేజోవతికి వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తమ సంఘానికి చెందిన మహిళకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు, సభ్యులు తేజోవతిని కలిసి సంఘీభావం తెలిపారు. ఎన్నికల్లో ఆమెకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

సంఘం అధ్యక్షుడు సోలా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ జి. పాల్యం తేజోవతి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడం తమ సంఘానికి గర్వకారణమన్నారు. కమలం గుర్తుపై పోటీ చేస్తున్న ఆమెకు సంఘం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సంఘంలోని నాయకులు, సభ్యులంతా ఐక్యంగా ఆమెకు సహకరిస్తామని పేర్కొన్నారు. తేజోవతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నికల ప్రక్రియలో అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA